బండి సంజయ్, రాజాసింగ్‌తో కలిసి.. భాగ్మలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు
29-11-2020 Sun 12:44
- భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు భారీగా వచ్చిన బీజేపీ శ్రేణులు
- వారాసిగూడకు బయలుదేరిన షా
- రోడ్ షోలో పాల్గొననున్న అమిత్ షా

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి హైదరాబాద్‌కు వచ్చిన బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. పలువురు బీజేపీ నేతలతో కలిసి ఆయన అక్కడ పూజలు చేశారు. ఆయన వెంట ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు.
భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి వారాసిగూడకు బయలుదేరారు. చార్మినార్‌లో ఆయన పర్యటన నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొని బీజేపీ తరఫున గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.
Advertisement 2
More Telugu News
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి
11 minutes ago

'సర్కారు వారి పాట' మొదలైంది!
15 minutes ago

రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబైలో నేడు భారీ ర్యాలీ.. నాసిక్ నుంచి కదిలివచ్చిన వేలాదిమంది రైతులు
20 minutes ago

Advertisement 3
దేశంలో కొత్తగా 13,203 మందికి కరోనా
46 minutes ago

నాలుగేళ్లలో 30,573 తప్పుడు ప్రకటనలు చేసిన డొనాల్డ్ ట్రంప్: 'వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనం!
1 hour ago

'లింగ వివక్ష లేదు.. మనుషులంతా ఒక్కటే' అంటూ బైడెన్ ఆర్డర్... క్రమంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
2 hours ago

Advertisement 4