భారత్తో రెండో వన్డేలో 300 దాటిన ఆస్ట్రేలియా స్కోరు
29-11-2020 Sun 12:33
- ఏజే ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు
- డేవిడ్ వార్నర్ 77 బంతుల్లో 83
- సెంచరీ బాదిన స్మిత్
- ఆస్ట్రేలియా స్కోరు 44 ఓవర్ల వద్ద 314/3

ఆస్ట్రేలియా-భారత్ మధ్య సిడ్నీలో జరుగుతోన్న రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న ఆసీస్ జట్టు స్కోరు 300 దాటింది. ఏజే ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు చేసి, ఒక సిక్సు, ఆరు ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసిన ఔటయ్యాడు. అనంతరం కొద్ది సేపటికే డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. అతడు 77 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు.
మూడో ఆర్డర్ లో వచ్చిన స్మిత్ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. దూకుడుగా ఆడుతూ 2 సిక్సులు, 14 ఫోర్లతో సెంచరీ బాదాడు. 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లాబుస్చాగ్నే 51, మ్యాక్స్ వెల్ 10 పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టు స్కోరు 44 ఓవర్ల వద్ద 314/3గా ఉంది. భారత బౌలర్లలో షమీ, పాండ్యాలకు ఒక్కో వికెటు దక్కాయి.
Advertisement 2
More Telugu News
దేశంలో కొత్తగా 13,203 మందికి కరోనా
11 minutes ago

ఈసీ కార్యాలయానికి చేరుకున్న నిమ్మగడ్డ... సర్వత్ర ఉత్కంఠ!
26 minutes ago

పద్మనాభస్వామి దర్శనానికి వెళ్లిన యూట్యూబ్ నటిపై కారు డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
26 minutes ago

Advertisement 3
నాలుగేళ్లలో 30,573 తప్పుడు ప్రకటనలు చేసిన డొనాల్డ్ ట్రంప్: 'వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనం!
1 hour ago

'లింగ వివక్ష లేదు.. మనుషులంతా ఒక్కటే' అంటూ బైడెన్ ఆర్డర్... క్రమంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
1 hour ago

Advertisement 4