చెప్పుడు మాటలు విని కేసీఆర్ నన్ను పక్కన పెట్టారు: స్వామిగౌడ్
26-11-2020 Thu 21:57
- కేసీఆర్ ను తండ్రిలా భావించాను
- తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించా
- బండి సంజయ్ దమ్మున్న మగాడు

నిన్న బీజేపీలో చేరిన తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్ గా కేసీఆర్ అవకాశం ఇచ్చారని... నీకు ఇంకేం కావాలని కొందరు ప్రశ్నిస్తున్నారని... రోడ్డు మీద ఖాళీగా ఉంటే తనను తీసుకొచ్చి మండలి ఛైర్మన్ చేయలేదని... తెలంగాణ ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించానని చెప్పారు. కొత్త బట్టలు కొనిచ్చాను... ముడ్డిమీద తంతా పడుండు అంటే ఎలా పడుంటానని ప్రశ్నించారు.
ఆత్మాభిమానం లేని చోట తాను ఉండలేనని స్వామిగౌడ్ చెప్పారు. కేసీఆర్ ను తాను తండ్రిలా భావించానని... అయితే, చెప్పుడు మాటలు విని తనను పక్కన పెట్టారని అన్నారు. రెండు నిమిషాల టైమ్ కూడా తనకు ఇవ్వలేదని చెప్పారు. బండి సంజయ్ దమ్మున్న మగాడు అని... పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చితే దారుస్సలాంను పగలగొడతామన్న నాయకుడని... ఇలాంటి బలమైన నాయకత్వమే ఇప్పుడు కావాలని అన్నారు.
Advertisement 2
More Telugu News
ఓడిన కార్పొరేటర్లతో ప్రారంభోత్సవాలా?... ట్రంప్ కు, టీఆర్ఎస్ సర్కారుకు తేడా లేదు: కిషన్ రెడ్డి
22 minutes ago

కారుకు సొట్టలు పడడంతో డ్రైవర్ పై చేయిచేసుకున్న నటుడు
57 minutes ago

కిడ్నాప్ కేసులో అఖిలప్రియ, భార్గవరామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి కీలకం: పోలీసులు
1 hour ago

Advertisement 3
ఏపీ కరోనా అప్ డేట్: 161 కొత్త కేసులు, 1 మరణం
3 hours ago

కృష్ణజింకల వేట కేసు: ఫిబ్రవరి 6న కోర్టులో హాజరు కావాలంటూ సల్మాన్ ఖాన్ కు న్యాయమూర్తి ఆదేశాలు
4 hours ago

Advertisement 4