జమిలి ఎన్నికలు దేశానికి చాలా అవసరం: మోదీ
26-11-2020 Thu 17:30
- జమిలి ఎన్నికలపై చర్చ అనవసరం
- ఎప్పుడూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి
- దీని ప్రభావం అభివృద్ది కార్యక్రమాలపై పడుతోంది

జమిలి ఎన్నికలను నిర్వహించాలనే యోచనలో బీజేపీ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ జాతీయ సదస్సును ఈరోజు మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ జమిలి ఎన్నికలపై చర్చ చాలా అనవసరమని అన్నారు. దేశానికి జమిలి ఎన్నికలు అత్యంత అవశ్యమని చెప్పారు.
మన దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని... దేశ అభివృద్ది కార్యక్రమాలపై దీని ప్రభావం పడుతోందని అన్నారు. ఈ విషయం ప్రజలకు కూడా అర్థమవుతూనే ఉందని చెప్పారు. ఈ సమస్యపై, జమిలి ఎన్నికలపై అధ్యయనం జరగాల్సి ఉందని... ప్రిసైడింగ్ అధికారులు దీనిపై తగిన మార్గదర్శకం చేయాలని అన్నారు.
Advertisement 2
More Telugu News
అనసూయకు పవన్ సినిమా నుంచి ఆఫర్?
6 hours ago

Advertisement 3
ఆర్ఆర్ఆర్ పతాక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం
7 hours ago

మూడు దశాబ్దాల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియా కంచుకోటను బద్దలు కొట్టారు... శభాష్ టీమిండియా: సీఎం జగన్
8 hours ago

టీడీపీ నేత దేవినేని ఉమను విడుదల చేసిన పోలీసులు
9 hours ago

Advertisement 4