బీజేపీ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు చేశాం: డీజీపీ మహేందర్ రెడ్డి

26-11-2020 Thu 14:43
Case filed against BJP MP Tejashwi Surya

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో కొందరు నేతల ప్రసంగాలు మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. నేతల ప్రసంగాలను పరిశీలిస్తున్నామని, విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న నేతలపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని డీజీపీ అన్నారు. గత ఆరేళ్లలో నగరంలో ఎలాంటి ఘటనలు జరగలేదని... కానీ, ఇప్పుడు విద్వేషాలను రగిల్చేందుకు కొందరు యత్నిస్తున్నారనే సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

సోషల్ మీడియా పోస్టులపై కూడా నిఘా పెట్టామని... అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని  కోరారు. గ్రేటర్ పరిధిలో ఉన్న మూడు కమిషనరేట్లలో 51,500 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారని చెప్పారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించేందుకు పోలీసు బృందాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

Advertisement 2

More Telugu News
UK coronavirus strain detected in at least 60 countries
Dehradun Man Opens Tea Joint After Breakup Says Tea Better Than Love
Atchannaidu fires on Jagan
AAP Sweeps in Maharashtra wins 96 seats in panchayat elections
Pawan Kalyan to meet Vengaiah Naidu family
Advertisement 3
Three militants killed in Major infiltration bid foiled in Jammu
Varla Ramaiah demads to expose Paster Praveen Chakravarthi relation with Brother Anil Kumar
My contract with Chennai Super Kings ends confirms Harbhajan Singh
ruckus at toll plaza in rajastan
there is danger from virus mutations
Suman supports AIADMK
active cases reches to 28 in poola village
Sania Mirza reveals she had contracted Corona virus
A wristband that tells your boss if you are unhappy
Australian Fan Chanting Bharat Mata Ki Jai During Indias Big Win At Gabba
..more
Advertisement 4