పులివెందులలో చర్చి వద్ద నిలిపిన రెండు స్కూలు బస్సులు దగ్ధం
21-11-2020 Sat 18:28
- పులివెందులలో కలకలం రేపిన అగ్నిప్రమాదం
- పూర్తిగా కాలిపోయిన స్కూలు బస్సులు
- మంటలు ఎలా వచ్చాయో తెలియడంలేదన్న యాజమాన్యం

కడప జిల్లా పులివెందులలో రెండు స్కూలు బస్సులు దగ్ధమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ రెండు బస్సులు ఓ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందినవి. మొత్తం 3 బస్సులను స్థానిక బేతేలు చర్చి వెనుక భాగంలో నిలిపి ఉంచగా, వాటిలో రెండు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఈ రెండు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు ఓ బస్సు అద్దాలు పగులగొట్టి దాన్ని పక్కకు తీసుకురావడంతో ఆ బస్సుకు ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలారోజులుగా బస్సులను తిప్పడంలేదని, నిలిపి ఉంచిన బస్సుల్లో మంటలు ఎలా వచ్చాయో తెలియడంలేదని స్కూలు యాజమాన్యం పేర్కొంది.
More Latest News
ఇది వినడానికే సిగ్గుగా ఉంది: విజయశాంతి
9 hours ago

తెలంగాణలో తాజాగా 477 కరోనా పాజిటివ్ కేసులు
9 hours ago

గతంలో నన్ను 'చవట' అన్నారు, 'దద్దమ్మ' అన్నారు... నేను పట్టించుకోలేదు: గెహ్లాట్ తో వివాదంపై సచిన్ పైలట్
10 hours ago
