రామ్ చరణ్, మంచు లక్ష్మితో మనోజ్ దీపావళి వేడుకలు
17-11-2020 Tue 15:37
- సోషల్ మీడియాలో ఫొటో పంచుకున్న మంచు మనోజ్
- దీపావళి సంబరాలు గొప్పగా జరిగాయంటూ ట్వీట్
- చెర్రీ, మంచు లక్ష్మిలను తనకిష్టమైన వాళ్లుగా పేర్కొన్న మనోజ్

టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ దీపావళి వేడుకలకు సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. హీరో రామ్ చరణ్, తన సోదరి మంచు లక్ష్మిలతో కలిసి తాను దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నదీ వెల్లడించారు. దీపావళి సంబరాలు చాలా గొప్పగా జరిగాయని, ప్రియమైన సోదరుడు రామ్ చరణ్, ప్రేమాస్పదురాలైన తన అక్క మంచు లక్ష్మి సమక్షంలో వేడుక చేసుకున్నానని తెలిపారు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో నిజమైన పండుగ జరుపుకున్నానని మనోజ్ ట్వీట్ చేశారు. కాగా, మనోజ్ పంచుకున్న ఫొటోలో రామ్ చరణ్ ఓ కేక్ కట్ చేస్తుండడాన్ని చూడొచ్చు.
ADVERTSIEMENT
More Telugu News
చెన్నైతో పోరు... గెలుపు కోసం రాజస్థాన్ అమీతుమీ
1 minute ago

శుభ్ మాన్ గిల్ కు కోహ్లీ వార్నింగ్... వీడియో ఇదిగో!
19 minutes ago

కేన్స్ లో పూజా హెగ్డేకి చేదు అనుభవం... ఏం జరిగిందంటే...!
47 minutes ago
