చార్మీ పెంపుడు కుక్కతో ప్రభాస్... నెట్లో సందడి చేస్తున్న ఫొటో!
10-11-2020 Tue 18:16
- ప్రభాస్ ఫొటో పోస్టు చేసిన చార్మీ
- అలాస్కన్ మలాముటే జాగిలంతో ప్రభాస్ దర్జా
- గతంలో చార్మీతో రెండు చిత్రాలు చేసిన ప్రభాస్

హీరోయిన్ నుంచి నిర్మాతగా అవతారం ఎత్తిన చార్మీ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫొటో పంచుకుంది. ఈ ఫొటోలో ప్రభాస్ ఉండడంతో నెట్టింట విపరీతంగా సందడి చేస్తోంది. ఈ ఫొటో గురించి చార్మీ ట్వీట్ చేసింది. 'తన 9 నెలల వయసున్న పెంపుడు కుక్కతో ప్రభాస్' అంటూ పేర్కొంది. ఓ విశాలమైన సోఫాలో కూర్చున్న ప్రభాస్... చార్మీకి చెందిన అలాస్కన్ మలాముటే జాతికి చెందిన జాగిలంతో రాజసం ఒలకబోయడం ఆ ఫొటోలో చూడొచ్చు.
ప్రభాస్ గతంలో చార్మీతో పౌర్ణమి, చక్రం చిత్రాల్లో నటించాడు. కాగా, ప్రభాస్ పూరీకనెక్ట్స్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ ఫొటోను క్లిక్ మనిపించినట్టు తెలుస్తోంది. ప్రభాస్... పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ చిత్రాల్లో నటించడం తెలిసిందే.
Advertisement 2
More Telugu News
ఇన్నాళ్లు సంపాదించిన డబ్బు ఏమైందని చూసుకుంటే అయినవాళ్లే మోసం చేశారని అర్థమైంది: నటుడు రాజేంద్ర ప్రసాద్
12 minutes ago

టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన షర్మిల
31 minutes ago

Advertisement 3
తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్
59 minutes ago

కమల్ సినిమాలో విలన్ గా ప్రముఖ నటుడు?
1 hour ago

మహిళపై యాసిడ్ పోసి పారిపోయిన దుండగుడు
2 hours ago

Advertisement 4