సోము వీర్రాజు వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానుకోవాలి: మాజీ మంత్రి జవహర్
05-11-2020 Thu 16:10
- చంద్రబాబు లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారన్న సోము
- పోలవరంపై వాస్తవాలు మాట్లాడాలని జవహర్ హితవు
- నీతి ఆయోగ్ సిఫారసుతోనే నిర్మాణ బాధ్యత ఇచ్చారని వివరణ

టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ధ్వజమెత్తారు. సోము వీర్రాజు వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానుకోవాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పినా, దానిపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నీతి ఆయోగ్ సిఫారసు మేరకే పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి ఇచ్చారని స్పష్టం చేశారు.
అంతకుముందు సోము వీర్రాజు రాజమండ్రి ప్రెస్ మీట్ లో పోలవరం నేపథ్యంలో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. పోలవరం విషయంలో లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలడని అన్నారు.
More Telugu News
భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకోగలం: అమెరికా
57 seconds ago

సౌందర్య మరణం కల అయితే బాగుండేది: ఇంద్రజ
6 minutes ago

లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి మరణిస్తున్నారన్న ప్రచారాన్ని నమ్మవద్దు: మంత్రి జగదీశ్ రెడ్డి
10 minutes ago

రేపటి నుంచి తెలంగాణలో సినిమా థియేటర్ల మూసివేత
44 minutes ago

భారీ రేటుకు 'అఖండ' హక్కులు!
55 minutes ago

కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు
1 hour ago

అయిష్టంగానే నాని ఆ కథను విన్నాడట!
1 hour ago

'పుష్ప' విషయంలో తగ్గేదే లేదట!
2 hours ago

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా అప్ డేట్స్!
2 hours ago
