మహిళల ఐపీఎల్: ట్రెయిల్ బ్లేజర్స్ పై టాస్ గెలిచిన వెలాసిటీ

05-11-2020 Thu 15:38
advertisement

మహిళల ఐపీఎల్ లో భాగంగా నిన్న రాత్రి వెలాసిటీ, సూపర్ నోవాస్ జట్ల మధ్య పోరు ఎంతో ఆసక్తికరంగా సాగడం తెలిసిందే. పురుషులకు తామేమీ తీసిపోమని అమ్మాయిలు అదరగొట్టారు. అద్భుతమైన చేజింగ్ తో వెలాసిటీ జట్టు మహిళల ఐపీఎల్ లో బోణీ కొట్టింది. ఈ క్రమంలో నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. షార్జా మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ, స్మృతి మంథాన కెప్టెన్సీ వహిస్తున్న ట్రెయిల్ బ్లేజర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన వెలాసిటీ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement