తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్

31-10-2020 Sat 19:14
advertisement

ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్ ముంగిట హోరాహోరీ పోరు నెలకొంది. ఇప్పటికే ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకోగా, మిగిలిన మూడు స్థానాల కోసం అనేక జట్లు రేసులో ఉన్నాయి. ఈ క్రమంలో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.

టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉండడంతో, ఆ రెండింట నెగ్గితేనే సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ కు వెళ్లగలుగుతుంది! అది కూడా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంది. దాంతో బెంగళూరుతో పోరును సన్ రైజర్స్ తీవ్రంగా పరిగణిస్తోంది.

ఇక, ఈ మ్యాచ్ కోసం రాయల్ చాలెంజర్స్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. శివం దూబే, స్టెయిన్ స్థానంలో నవదీప్ సైనీ, ఇసురు ఉదన జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ లో గాయపడిన విజయ్ శంకర్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదని సన్ రైజర్స్ కెప్టెన్ వార్నర్ తెలిపాడు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement