పవన్ కల్యాణ్ సినిమాలో మరో బిజీ స్టార్?

30-10-2020 Fri 21:17
Another busy star to play in Pawan Kalyans film

చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న పవన్ కల్యాణ్ ఆ తరువాత వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలు కమిట్ అయ్యారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

వీటిలో ఒకటి 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్. మలయాళంలో వచ్చిన ఈ హిట్ సినిమాలో పవన్ కాకుండా కీలకమైన మరో హీరో పాత్ర కూడా ఉంటుంది. ఈ పాత్రలో నటిస్తారంటూ మొదటి నుంచీ రానా దగ్గుబాటి పేరు వినిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులుగా పవన్ అభిమాని యంగ్ హీరో నితిన్ పేరు వార్తల్లోకి వచ్చింది.

ఈ క్రమంలో ఇప్పుడు, తాజాగా కన్నడ బిజీ స్టార్ కిచ్చ సుదీప్ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్రకు సుదీప్ బాగా సూటవుతాడని భావించిన దర్శక నిర్మాతలు ప్రస్తుతం అతనితో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ వార్తలో నిజమెంతుందన్నది త్వరలో తెలుస్తుంది.

ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. అలాగే దీనికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాస్తాడని అంటున్నారు. మరో విషయం ఏమిటంటే, ఇందులో పవన్ సరసన కథానాయిక పాత్రకి సాయిపల్లవిని అడుగుతున్నారట. మొత్తానికి ఈ సినిమా చాలా విశేషాలని సంతరించుకుంటోంది. 

Advertisement 2

More Telugu News
BSF walked 200 metres inside Pak territory
Ananya Pande praises Vijay Devarakonda
we did not said the we give corona vaccine to all
GHMC Elections polling percentage recorded slightly higher than last elections
AIIEA solidarity to farmers pesant movement
Advertisement 3
Huge meteor enlighten Japan sky
 Another monolith creates sensation
AP Government model house
AR Murugadas to make Hollywood film
Deep Depression in Bay Of Bengal intensified into Cyclone Burevi
London court extends Nirav Modis remand
Farmers meeting with Union Ministers ended in a incomplete manner
Bandla Ganesh is my God
Vijayashanthi response on less voting in GHMC elections
Sandeep Kataria appointed as Bata Global CEO
..more
Advertisement 4