రాజశేఖర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు: జీవిత
29-10-2020 Thu 14:27
- ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోంది
- ఇన్ఫెక్షన్ 80 శాతం తగ్గింది
- రెండు రోజుల్లో ఐసీయూ నుంచి బయటకు వచ్చే అవకాశం

ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడింది. హైదరాబాదులోని సిటీ న్యూరో ఆసుపత్రిలో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. జీవిత హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. రాజశేఖర్ కు వైద్యులు ప్లాస్మా థెరపీ ఇచ్చారు. మరోపక్క రాజశేఖర్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్ ఆరోగ్యంపై జీవిత స్పందించారు. ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారని చెప్పారు. గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని... 80 శాతం ఇన్ఫెక్షన్ తగ్గిందని తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన ఐసీయూ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాజశేఖర్ ఆరోగ్యం గురించి తాము ప్రతిరోజు వైద్యులతో మాట్లాడుతున్నామని తెలిపారు.
More Latest News
మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'
3 hours ago

తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్
4 hours ago

వరల్డ్ చాంపియన్ షిప్‌కు పీవీ సింధు దూరం... కారణం చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ షట్లర్
4 hours ago

విజయనగరం జిల్లాలో పాత ఇల్లు కూల్చుతుండగా బయటపడిన లాకర్... మాదంటే మాదని యజమాని, కూలీల మధ్య వివాదం
5 hours ago
