ఇటలీ వీధుల్లో ప్రభాస్, లేడీ కొరియోగ్రాఫర్ సెల్ఫీలు
27-10-2020 Tue 17:35
- రాధేశ్యామ్ షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న ప్రభాస్
- బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ తో సెల్ఫీలు
- సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు

ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ కోసం ఇటలీలో ఉన్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటలీలో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరుపుతున్నారు.
తాజాగా, రాధేశ్యామ్ షూటింగ్ లొకేషన్లలో ప్రభాస్, బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ తో దిగిన సెల్ఫీలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షూటింగ్ విరామాల్లో సరదాగా గడుపుతున్న ప్రభాస్... వైభవి మర్చంట్ తో ఇటలీ వీధుల్లో హాయిగా ఆస్వాదిస్తున్నాడు. సెట్స్ పైకి అడుగుపెట్టిన సందర్భంగా వైభవి ఓ అందమైన పుష్పగుచ్ఛాన్ని ప్రభాస్ కు అందించింది.
Advertisement 2
More Telugu News
అహ్మదాబాద్ టెస్టులో ముగిసిన తొలిరోజు ఆట
4 minutes ago

Advertisement 3
Advertisement 4