ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్స్.. సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్లు!

26-10-2020 Mon 07:30
FlipKart announces Diwali sale

ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించిన ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సేల్ జాతరకు తెరతీసింది. దివాలి సేల్ పేరుతో తన కస్టమర్ల ముందుకు వస్తోంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు దివాలి సేల్ ఆఫర్ ఉంటుందని ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి 21 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ జరిగింది. ప్రస్తుతం ఉన్న దసరా స్పెషల్ సేల్ అక్టోబర్ 28 వరకు కొనసాగనుంది. ఇది ముగిసిన వెంటనే దివాలి సేల్ ప్రారంభం కానుంది.

దివాలి సేల్స్ ద్వారా మొబైల్స్, టీవీలు, ఇతర ప్రాడక్ట్ లపై డిస్కౌంట్లతో పాటు స్పెషల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటివి క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఇస్తున్నాయని చెప్పింది. బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐలతో పాటు పలు బ్యాంకులు నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లను అందించబోతున్నాయని తెలిపింది.

కెమెరాలు, ల్యాప్ టాపులు, స్మార్ట్ వాచీలు, హెడ్ ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు ఆఫర్లను వినియోగదారులు ఎక్స్ పెక్ట్ చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై 80 శాతం వరకు డిస్కౌట్లు లభిస్తాయిని... ల్యాప్ టాప్ లపై 50 శాతం వరకు డివైజెస్ లపై బెనెఫిట్స్ ఉంటాయని చెప్పింది.

కొన్ని రిపోర్టుల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41, శాంసంగ్ గెలాక్సీ ఎస్20ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్, పోకో ఎం2, పోకో ఎం2ప్రో, పోకో సీ3, రెనో 2ఎఫ్, ఒప్పో ఏ52, ఒప్పో ఎఫ్15, రియల్ మీ నార్జో 20 సిరీస్ తదితర ఫోన్లపై ఈ డిస్కౌంట్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఒక్క రూపాయికే మొబైల్ ప్రొటెక్షన్ ఇవ్వనున్నట్టు సమాచారం.


ADVERTSIEMENT

More Telugu News
nara lokesh satires on ys jagan davos tour
Pooja Hegde lost her baggage ahead of Cannes Red Carpet formality
revanth reddy tweet on a song which questions kcr regime
telangana givernment decreases dsp aspirants hight to 165 centi meters
Godavari Flows to India as UTK
Ntr in Buchhi Babu movie
Russia mulls to use Thermobaric bombs on Ukraine
praja shanthi party chief k a paul comments on alliance in telangana assembly elections
India gets the highest annual FDI inflow in last financial year
Vikram movie trailar released
NTR statement on his birthday
ambati rambabu satires on tdp allegations
Gorantla Butchaiah Chowdary comments on CM Jagan
budda venkanna satires on ap cm ys jagan and ambati rambabu
Saipallavi in Shivakarthikeyan Movie
..more