పండగ నాడు విషాదం... వనపర్తి జిల్లాలో ఇల్లు కూలి ఐదుగురి దుర్మరణం!
25-10-2020 Sun 08:05
- ఇటీవలి వర్షాలకు నానిపోయిన మిద్దె
- నిద్రిస్తున్న వేళ కూలడంతో ఘటన
- అత్త, ఇద్దరు కోడళ్లు, ఇద్దరు మనవరాళ్లు మృతి

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు, ఇంటి పైకప్పు నానిపోయి కూలడంతో, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు దుర్మరణం పాలయ్యాారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
గ్రామానికి చెందిన మణెమ్మ ఇంటి మిద్దె గత రాత్రి కుప్పకూలింది. అందరూ నిద్రలో ఉండటం, ఒక్కసారిగా పైకప్పంతా కూలడంతో ఎవరూ తప్పించుకునేందుకు క్షణాల వ్యవధైనా లేకపోయింది. ఈ ప్రమాదంలో మణెమ్మతో పాటు ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, పింకి మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో తాజాగా 47 మందికి కరోనా పాజిటివ్
24 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
2 hours ago
