వరద బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలి: అధికారులకు సీఎం జగన్ ఆదేశం
19-10-2020 Mon 20:34
- వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన జగన్
- వరద బాధితులను గుర్తించాలని ఆదేశం
- రైతులకు వీలైనంత త్వరగా ఇన్ పుట్ సబ్సిడీని ఇవ్వాలన్న సీఎం

వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఏరియల్ సర్వే చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అవనిగడ్డ, పెనమలూరు, నందిగామ, మైలవరం, తాడికొండ నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జగన్ వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని ఉన్నారు.
అనంతరం అధికారులతో వరద పరిస్థితిపై జగన్ సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను తక్షణమే గుర్తించి వారికి నష్ట పరిహారం అందించాలని ఈ సందర్బంగా సీఎం ఆదేశించారు. పంట నష్టంపై వీలైనంత త్వరగా అంచనాలను పూర్తి చేయాలని చెప్పారు. రైతులకు వీలైనంత త్వరగా ఇన్ పుట్ సబ్సిడీని అందించాలని ఆదేశించారు. సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీని ఇస్తే... రబీ సీజన్ లో పెట్టుబడికి ఉపయోగపడుతుందని చెప్పారు.
More Latest News
తెలంగాణ డీజీపీ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. పోలీసులనే డబ్బు అడిగిన సైబర్ నేరగాళ్లు!
29 minutes ago

హీరో శ్రీకాంత్, ఊహల కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
45 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
1 hour ago

మహారాష్ట్రలో మలుపు తిరుగుతున్న రాజకీయం.. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేకు ఏక్నాథ్ షిండే ఫోన్!
1 hour ago

దేశంలో మళ్లీ 17వేల కరోనా కొత్త కేసులు
2 hours ago

20 ఏళ్ల తర్వాత రష్యాకు అత్యంత గడ్డు స్థితి!
2 hours ago
