వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... తెలంగాణకు భారీ వర్ష సూచన

10-10-2020 Sat 16:37
Heavy rain alert for Telangana

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలంగాణలో రాగల మూడ్రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది.

ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.

రేపు, ఎల్లుండి ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వివరించారు. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. కాగా, ఈ నెల 14న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది క్రమంగా తుపానుగా రూపాంతరం చెంది ఒడిశా తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.


More Telugu News
Virat Kohli registered two unwanted records after mumbai duck
Omicron Variant can escape be alert warns new study
Senior congress leader Konijeti Rosaiah died
Jawad strengthened as a severe storm
YS Jagan petition On daily attendance on court
Day Of Shame For Pakistan Says Imran Khan As Sri Lankan Man Lynched
please do what you said before elections Amravati Farmers to jagan
Maoists got vaccines from Telangana and Andhrapradesh
Karnataka government orders probe into test reports of SA national
Smriti Irani explains on Raghurama Krishnaraju complaint
CM Jagan reviews Cyclone Jawad situation
Mystery lights spotted in Pathankot sky
CM Jagan assures financial help to a kidney deceased woman
Omicron spreads faster in Britain
Chandrababu held meeting with Akiveedu TDP leaders
..more