సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
09-10-2020 Fri 07:38
- రష్మిక తమిళ సినిమా పూర్తయిందట!
- రజనీకాంత్ సినిమా మరింత ఆలస్యం
- హైదరాబాదులో శర్వానంద్ 'శ్రీకారం'

* అందాల కథానాయిక రష్మిక నటిస్తున్న తొలి తమిళ చిత్రం 'సుల్తాన్'. కార్తీ హీరోగా భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం బ్యాలెన్స్ షూటింగ్ నిన్నటితో ముగిసింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తవడంతో రష్మిక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
* తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న అన్నాత్తే చిత్రం షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదు. చెన్నైలో ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలవుతుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, హీరోయిన్లు మీనా, కీర్తి సురేశ్ ఇతర సినిమాల షూటింగుల్లో బిజీగా ఉండడం వల్ల అన్నాత్తే మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
* శర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీకారం' చిత్రం తదుపరి షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ కూడా షూటింగులో జాయిన్ అయింది.
More Latest News
ఇది వినడానికే సిగ్గుగా ఉంది: విజయశాంతి
9 hours ago

తెలంగాణలో తాజాగా 477 కరోనా పాజిటివ్ కేసులు
9 hours ago

గతంలో నన్ను 'చవట' అన్నారు, 'దద్దమ్మ' అన్నారు... నేను పట్టించుకోలేదు: గెహ్లాట్ తో వివాదంపై సచిన్ పైలట్
10 hours ago
