రాణించిన పృథ్వీ షా, పంత్... చెన్నై టార్గెట్ 176 రన్స్
25-09-2020 Fri 21:18
- టాస్ గెలిచిన చెన్నై
- మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు

చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా 43 బంతుల్లో 64 పరుగులు చేశాడు. షా 9 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అతడికి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (35) నుంచి మంచి సహకారం లభించింది.
ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన రిషబ్ పంత్ తో పాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (26) కూడా ధాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. పంత్ 25 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో పియూష్ చావ్లా 2, శామ్ కరన్ ఒక వికెట్ తీశారు.
కాగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కంట్లో ఏదో పడడంతో షా ఎంతో ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఇది గమనించిన ధోనీ... దగ్గరికి వచ్చి కంట్లో ఏదైనా నలుసు పడేందేమో అని పరిశీలించి, ఎలాంటి ఇబ్బంది లేదులే అని అనునయించడం మ్యాచ్ లో దర్శనమిచ్చింది.
Advertisement 2
More Telugu News
రామ్ చరణ్ తో జతకట్టనున్న పూజ హెగ్డే!
6 hours ago

Advertisement 3
ఏపీలో కనిష్ఠ స్థాయిలో కొత్త కేసుల నమోదు
7 hours ago

సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం.. పంచాయతీ ఎన్నికలకు మేం సిద్ధం: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
8 hours ago

ప్రధాని మోదీ ఈ పుస్తకం చదివితే తప్పకుండా తమిళ భాషను, సంస్కృతిని గౌరవిస్తారు: రాహుల్ గాంధీ
9 hours ago

అన్నా రాంబాబుపై పోటీకి పవన్ అవసరం లేదు.... వెంగయ్యనాయుడు భార్య చాలు: జనసేన ప్రకాశం జిల్లా ఇన్చార్జి
9 hours ago

Advertisement 4