అయోధ్యలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు... కారణమిదే!

21-09-2020 Mon 11:37
Land Prices Sky Rocketing in Ayodhya

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా నిర్మాణ రంగం కుదేలైంది. అద్దె ఇళ్లు పెరిగిపోయాయి. కొత్తగా ఇళ్లు కొనేవాళ్లు ఎవరూ లేకుండా పోయారు. కానీ, ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య ప్రాంతంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన జరిగి దాదాపు నెల రోజులు అవుతుండగా, ఇక్కడ స్థిరాస్థి ధరలు ఆకాశానికి తాకుతున్నాయి.

అయోధ్యలో నెల రోజుల వ్యవధిలోనే భూముల ధరలు 30 నుంచి 40 శాతం వరకూ పెరిగాయి. నగరాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన తరువాత, పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బడాబాబులు, ఇక్కడ భూములు కొనేందుకు పరుగులు పెడుతూ వచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం, స్టార్ హోటళ్లతో పాటు, పలు నిర్మాణాలకు అయోధ్యలో అనుమతి ఇస్తున్నామని ఆదిత్యనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పలువురు రియల్టర్లు అయోధ్య ప్రాంతంలో వాలిపోయారు. అందుబాటులో ఉన్న భూములన్నీ కొనుగోలు చేస్తూ, నిర్మాణాలు ప్రారంభించే ప్రయత్నాల్లో నిర్మాణ రంగ కంపెనీలు ఉన్నాయి. అయోధ్యలో అలయం నిర్మితమైతే, భారీగా భక్తులు వస్తారన్న ఆలోచనతోనే ఇక్కడి భూములను సొంతం చేసుకునేందుకు బడాబాబులు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement 2

More Telugu News
Krishnam Raju greets Prabhas on his birthday
Dont misuse your power says TS DGP to trainee SIs
Mamata Mohan Das turns as producer
BeatsOfRadheShyam out now Prabhas
Where is Bandi Sanjay asks Harish Rao
Advertisement 3
sonu sood idol in durgamata temple
better results of oxford vaccine
Pramod Mittal declared bankrupt
Chandrababu damaged the name Amaravati says Appalaraju
A 87 year old homoeopathic doctor in Chandrapur district braves COVID19 pandemic to treat villagers
All streaming platforms are nothing but a porn hub says Kangana Ranaut
david warner about win
vijaya sai slams chandrababu
Modi Election Campaign in Bihar
devineni uma slams jagan
..more
Advertisement 4