ఇద్దరు ఆడశిశువులకు విషం తాగించిన తండ్రి

04-09-2020 Fri 12:06
advertisement

ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తూ కుమారుల కంటే బాగా తల్లిదండ్రులను చూసుకుంటున్న ఈ రోజుల్లోనూ ఆడశిశువులపై తండ్రుల తీరు మారట్లేదు. కవల ఆడపిల్లలు పుట్టారని వారికి ఓ తండ్రి విషం ఇచ్చిన ఘటన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గండేడ్ మండ‌లం దేశాయిపల్లిలో చోటు చేసుకుంది.

కృష్ణ‌వేణి అనే మహిళ ఇటీవల ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వారికి ఇప్పటికే ఓ కూతురు ఉం‌ది. రెండో కాన్పులో కూడా ఆడపిల్లలే పుట్టారని తండ్రి కేశ‌వులు ఆగ్రహంతో ఉన్నాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా క‌వ‌ల ఆడ శిశువుల‌తో పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ శిశువులు  అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లడాన్ని గమినించిన కుటుంబ సభ్యులు వారిని పిల్ల‌ల ఆసుపత్రిలో చేర్పించారు.

వారిని పరీక్షించిన వైద్యులు  మెరుగైన చికిత్స కోసం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఆసుపత్రికి త‌ర‌లించారు. ఇటీవల కేశ‌వులు ఓ దుకాణంలో పురుగుల మందు డ‌బ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement