సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
12-08-2020 Wed 07:46
- షూటింగులో పాల్గొన్న సమంత
- బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ నటుడు
- షూటింగుకి రెడీ అవుతున్న నాగశౌర్య

* కరోనాకి భయపడి అందరూ షూటింగులు వాయిదా వేసుకుంటుంటే కథానాయిక సమంత మాత్రం ధైర్యంగా షూటింగులో పాల్గొంది. ఈ కామర్స్ సంస్థ 'మింత్ర'కు తను బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన వాణిజ్య చిత్రం షూటింగులో సమంత పాల్గొంటోంది. హైదరాబాదులోని ఓ స్టూడియోలో కరోనా నిబంధనల నడుమ షూటింగ్ చేస్తున్నారు.
* బాలకృష్ణ, బోయపాటి కలయికలో మూడో చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూలు షూటింగు పూర్తయింది. ఇదిలావుంచితే, ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ని తీసుకున్నట్టు తాజా సమాచారం.
* నాగశౌర్య కథానాయకుడుగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన సంగతి విదితమే. నాగశౌర్య విలుకాడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల మొదటి వారం నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Advertisement 2
More Telugu News
Advertisement 3
తీర్పులను తప్పుబట్టొచ్చు కానీ, న్యాయమూర్తులను దూషించడం సరికాదు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
9 hours ago

ప్రస్తుతం టీమిండియా 90వ దశకం నాటి ఆస్ట్రేలియా జట్టును తలపిస్తోంది: ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్
9 hours ago

Advertisement 4