రియా, ఆమె సోదరుడిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు
Advertisement .b
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆర్థిక కోణం ఉందన్న అనుమానంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తిలను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

ఈ ఉదయం రియా, ఆమె సోదరుడు ముంబయిలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. వీరిద్దరినీ ఈడీ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. సుశాంత్ కేసుకు సంబంధించి రియా, షోయిక్ లపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.

ఈ ఉదయం రెండు గంటల పాటు ఈడీ ప్రశ్నావళిని ఎదుర్కొన్న షోయిక్ ఆపై కార్యాలయం నుంచి బయటికి వచ్చాడు. కొన్ని కీలక పత్రాలు తీసుకురావాలంటూ అతడిని ఈడీ అధికారులే బయటికి అనుమతించారని ఆ తర్వాత తెలిసింది. ఆపై షోయిక్ కాసేపటికే మళ్లీ ఈడీ కార్యాలయానికి రాగా, మరోసారి విచారించారు.
Fri, Aug 07, 2020, 07:11 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View