మరో సినిమాకి ఓకే చెప్పిన రవితేజ!
Advertisement .b
హీరో రవితేజ మాంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న రవితేజ ఇటీవల వరుసగా కథలు వింటూ నచ్చిన వాటికి వెంటనే ఓకే చెప్పేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు మారుతితో కూడా ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

ఆమధ్య సాయితేజ్ హీరోగా 'ప్రతిరోజూ పండగే' చిత్రాన్ని రూపొందించి హిట్ కొట్టిన దర్శకుడు మారుతి ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. నాని హీరోగా ఓ చిత్రాన్ని చేయనున్నాడంటూ ఇటీవల వార్తలొచ్చినప్పటికీ ఆ ప్రాజక్టు విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

ఇదిలావుంచితే, తాజా సమాచారం ప్రకారం, మారుతి తన తదుపరి చిత్రాన్ని రవితేజతో చేస్తున్నాడు. ఇటీవల రవితేజను కలసి తాను ఆయన కోసం సిద్ధం చేసిన కథను చెప్పాడనీ, రవితేజకు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజక్టుకి ఆయన ఓకే చెప్పేశాడనీ అంటున్నారు. దీంతో మారుతి ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి స్క్రిప్టు తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాడట.    
Thu, Aug 06, 2020, 09:27 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View