సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement .b
*  కథానాయిక నయనతార తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ ని త్వరలో పెళ్లాడనుంది. ఈ క్రమంలో ప్రియుడితో కలసి ఇటీవల పలు దేవాలయాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలో త్వరలో కుంభకోణంలోని తిరునగేశ్వరం రాహు దేవాలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తుందట. తమ వివాహానికి ఏ ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో అమ్మడు ఈ పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
*  ప్రస్తుతం తమిళంలో విజయ్ హీరోగా 'మాస్టర్' చిత్రాన్ని చేస్తున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ త్వరలో ఓ తెలుగు చిత్రాన్ని చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈయనతో చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో 'పుష్ప', 'సర్కారు వారి పాట' చిత్రాలను నిర్మిస్తోంది.
*  'ఆర్ ఎక్స్ 100' ఫేం కార్తికేయ తమిళం నుంచి ఓ ఆఫర్ పొందినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విలన్ పాత్రకు కార్తికేయను అడుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కార్తికేయ 'చావు కబురు చల్లగా' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
Wed, Aug 05, 2020, 07:32 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View