బిగ్ బాస్ నాలుగో సీజన్ హౌస్ ఇదే... ప్రిపరేషన్స్ జరుగుతున్న వీడియో ఇదిగో!
Advertisement .b
టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్-4కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం అవుతుందన్న ప్రోమో కూడా విడుదల కాగా, ఇప్పుడు హౌస్ లో జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఈ నెల 30 నుంచి నాలుగో సీజన్ ప్రారంభమై, దాదాపు 100 రోజుల పాటు జరుగుతుందని తెలుస్తుండగా, కంటెస్టెంట్లుగా చాలామంది సెలబ్రిటీల పేర్లే వినిపిస్తున్నాయి.

సినిమా షూటింగ్ లు కరోనా,లాక్ డౌన్ కారణంగా ఆగిపోవడంతో పలువురు ప్రముఖులు ఈ సీజన్ హౌస్ లోకి వెళ్లనున్నారని, దీంతో ఈ ప్రోగ్రామ్ రక్తి కడుతుందని అంచనా. ఇక నాలుగో సీజన్ హౌస్ ఎలా ఉండబోతుందో, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఈ వీడియోను చూసి మీరూ తెలుసుకోవచ్చు. 
Wed, Aug 05, 2020, 06:46 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View