13 ఏళ్ల విద్యార్థినిపై ఏడాదిగా ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం
26-07-2020 Sun 09:01
- రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో దారుణం
- 13 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు
- నిందితులకు సహకరించిన ముగ్గురు మహిళా టీచర్లపైనా కేసులు

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 13 ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అల్వార్ జిల్లాలోని నారాయణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పాఠశాల మేనేజర్, ఉపాధ్యాయులతోపాటు ఇతర సిబ్బంది బాలికపై ఏడాదిగా అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 13 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారిపై పోక్సో సహా భారత శిక్షా స్మృతిలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, నిందితులకు సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మహిళా టీచర్లపైనా కేసులు నమోదయ్యాయి.
More Latest News
జీ7 దేశాధినేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు
10 minutes ago

హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం.. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
20 minutes ago

అందుకే ఎన్టీఆర్ ప్రాజెక్టు ఆలస్యమవుతోందట!
35 minutes ago

నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
51 minutes ago

'పుష్ప 2'లో మరో హీరోయిన్ పాత్ర అదేనట!
1 hour ago
