కలసి 'థ్యాంక్ యూ' చెబుతున్న చైతు, సమంత
Advertisement .a
ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత జంట ఆ తర్వాత కొంతకాలానికి 'మజిలీ' చిత్రంలో కలసి నటించారు. ఇది విజయాన్ని సాధించడంతో ఈ జంటతో మళ్లీ సినిమాలు చేయాలని చాలామంది ప్రయత్నించారు. అయితే, కలిసి నటించడానికి వీరిద్దరూ మళ్లీ అంగీకరించలేదు. ఈ క్రమంలో త్వరలో మళ్లీ ఈ జంట తెరపై సందడి చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ జంటను కలిపే ప్రయత్నం చేస్తున్నది దర్శకుడు విక్రంకుమార్.

గతంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలతో కలసి 'మనం' వంటి కొత్త తరహా చిత్రాన్ని రూపొందించి విజయం సాధించిన విక్రంకుమార్ ఇటీవల చైతన్యకి ఓ కథ చెప్పాడట. అది అతనికి బాగా నచ్చడంతో చేయడానికి తాను రెడీ అయ్యాడు. అయితే, ఇందులో హీరోయిన్ గా సమంత అయితేనే బాగా సూటవుతుందని విక్రంకుమార్ చెప్పాడట. దాంతో సమంతను ఒప్పించే బాధ్యతను తీసుకుని చైతూ ఆమెతో ఓకే చెప్పించాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'థ్యాంక్ యూ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Thu, Jul 02, 2020, 06:31 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View