ముంబయిలోని తాజ్ హోటళ్లకు బాంబు బెదిరింపులు
30-06-2020 Tue 13:17
- 26/11 దాడుల తరహాలో అటాక్ జరుగుతుందని బెదిరింపు
- భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
- 2008లో తాజ్ హోటల్ పై ఉగ్రదాడి

ముంబయిలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పై 2008లో భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. కొలాబా ప్రాంతంలో ఉన్న ఆ హోటల్ కు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో అందరిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ ఫోన్ కాల్ పాకిస్థాన్ లోని కరాచీ నగరం నుంచి వచ్చినట్టు గుర్తించారు. 26/11 దాడుల తరహాలోనే మరోసారి అటాక్ జరుగుతుందని ఆ వ్యక్తి హెచ్చరించినట్టు తెలిసింది. ఫోన్ కాల్ నేపథ్యంలో తాజ్ హోటల్ ప్రాంతంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అటు, బాంద్రాలో ఉన్న తాజ్ లాండ్స్ ఎండ్ హోటల్ కు కూడా బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో అక్కడ కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ ఫోన్ కాల్స్ గతరాత్రి వచ్చినట్టు చెబుతున్నారు.
More Latest News
అమ్మకాల్లో ‘టాటా పంచ్’ రికార్డులు
17 minutes ago

గోరంట్ల మాధవ్ వీడియోపై ప్రధాని, లోక్ సభ స్పీకర్, మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ
18 minutes ago

వైఎస్ విజయమ్మకు తప్పిన పెను ప్రమాదం
24 minutes ago

ఎన్నికల ఉచిత తాయిలాలు ‘తీవ్రమైన అంశమే’: సుప్రీంకోర్టు
26 minutes ago

ఒడిశాలో అదానీ గ్రూపు భారీ అల్యూమినియం పరిశ్రమ
58 minutes ago

అంతర్జాతీయ స్థాయిలో 'కార్తికేయ 3'
1 hour ago
