సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

27-06-2020 Sat 07:29
advertisement

*  రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం నుంచి కథానాయిక అలియా భట్ తప్పుకున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. అలియా ఎప్పటికప్పుడు రాజమౌళితో టచ్ లో ఉంటోందని, షూటింగ్ ప్రారంభించడాన్ని బట్టి డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా వుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.  
*  లాక్ డౌన్ కారణంగా చిత్ర రంగం కూడా బాగా నష్టపోయింది. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారన్న విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో భారీ చిత్రాల నిర్మాతలు తమ చిత్రాల బడ్జెట్టును తగ్గించుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం బడ్జెట్టులో కూడా బాగా కోత పెడుతున్నారట. అందుకు తగ్గట్టుగా స్క్రిప్టులో చిన్న చిన్న మార్పులు చేస్తున్నట్టు సమాచారం.    
*  తమిళ హీరో విశాల్ నటిస్తున్న 'చక్ర' చిత్రం నాలుగు భాషల్లో రూపొందుతోంది. కాగా, ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీ ప్లేయర్ ద్వారా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కొందరు ఓటీటీ నిర్వాహకులతో ఈ విషయంలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.  

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement