పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌కు కరోనా.. నవదంపతుల సహా మొత్తం క్వారంటైన్లోకి!
23-06-2020 Tue 08:02
- కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఘటన
- ఈ నెల 14న కరోనా బారినపడిన వంట మాస్టర్
- కొత్త దంపతులు సహా 56 మందిని క్వారంటైన్‌కు పంపిన అధికారులు

పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌కు వైరస్ సోకడంతో కొత్త జంట సహా వారి కుటుంబ సభ్యులు, పెళ్లికి హాజరైనవారు అందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా గుబ్బి తాలూకాలో జరిగిందీ ఘటన.
అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం ఇటీవల ఇంటి వద్ద నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లిలో వంట చేసిన మాస్టర్(55)కు ఈ నెల 14న జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకుంటే కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్త జంటతోపాటు వారి కుటుంబ సభ్యులు, పెళ్లికొచ్చిన అతిథులు కలిపి మొత్తం 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, పెళ్లి జరిగిన ప్రాంతాన్ని సీల్ చేసి రసాయనాలు స్ప్రే చేశారు.
More Latest News
మరో రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం
2 minutes ago

'సలార్' కోసం యాక్షన్ ఎపిసోడ్ తో బిజీగా ఉన్న ప్రభాస్!
2 minutes ago

మోదీ భీమవరం టూర్‌కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం
17 minutes ago

ధర్మవరంలో ప్రెస్ మీట్ జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం సిగ్గుచేటు: విష్ణువర్ధన్ రెడ్డి
21 minutes ago

ప్రభాస్ హీరో అవుతాడని ముందే అనుకున్నాను: గోపీచంద్
44 minutes ago

సంజయ్ రౌత్‌కు మరోమారు ఈడీ సమన్లు
48 minutes ago

ధర్మవరం ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలపై దాడి
56 minutes ago

టీహబ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
1 hour ago
