సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

23-06-2020 Tue 07:31
advertisement

*  శ్రీదేవి బయోపిక్ లో ఆమె పాత్ర పోషించాలని వుందని చెబుతోంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. 'చిన్నప్పటి నుంచీ నేను శ్రీదేవికి వీరాభిమానిని. ఆమె బయోపిక్ లో నటించాలనేది నా కల. అటువంటి అవకాశం వస్తే నా అంతటి అదృష్టవంతులు ఎవరూ వుండరు' అని చెప్పింది.    
*  ప్రస్తుతం తెలుగులో తాను నాలుగు సినిమాలలో నటిస్తున్నానని చెప్పింది 'పెళ్లిచూపులు' ఫేం రీతూ వర్మ. వీటిలో శర్వానంద్ తో కలసి నటించే సినిమా కూడా వుందని చెప్పింది. ప్రస్తుతం రీతూ వర్మ నాని హీరోగా నటిస్తున్న 'టక్ జగదీశ్' చిత్రంలో కూడా నటిస్తోంది.
*  అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బ్యాచిలర్' చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేస్తారంటూ వార్తలొచ్చినప్పటికీ, వాటిల్లో వాస్తవం లేదని తెలుస్తోంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement