డీవైఎఫ్ఐ నేత మొహమ్మద్ రియాస్ను పెళ్లి చేసుకున్న కేరళ సీఎం కూతురు.. ఫొటోలు ఇవిగో
15-06-2020 Mon 12:36
- పినరయి విజయన్ సమక్షంలో పెళ్లి
- తిరువనంతపురంలో వివాహం
- కొద్ది మంది అతిథులు హాజరు

డీవైఎఫ్ఐ అధ్యక్షుడు పీఏ మొహమ్మద్ రియాస్ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణ (43) ఈ రోజు పెళ్లి చేసుకున్నారు. తిరువనంతపురంలో పినరయి విజయన్ సమక్షంలో ఆయన అధికారిక నివాసంలో ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లికి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.
వీణకు బెంగళూర్లో ఓ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఇక గత ఎన్నికల్లో కోజికోడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన రియాస్ కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారు. రియాస్కి 2002లో మొదటి పెళ్లి జరిగింది. 2015లో తన భార్యకు ఆయన విడాకులు ఇచ్చారు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. వీణ తన మొదటి భర్తకు 2015లో విడాకులు ఇచ్చారు.
More Latest News
ఆ వీడియో మార్ఫింగ్ చేసినదే... గోరంగ్ల మాధవ్ వీడియోపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్య
1 minute ago

పొద్దున ఎనిమిదికి ముందు.. రాత్రి ఏడు తర్వాత కాల్స్ చేయొద్దు: లోన్ రికవరీ ఏజెంట్లకు రిజర్వు బ్యాంకు ఆదేశాలు
30 minutes ago

ఇంటి గోడపై మూత్రం పోశాడని.. వెంటపడి మరీ పొడిచి చంపేశారు!
48 minutes ago

మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపాటు
54 minutes ago
