కాలువను శుభ్రం చేస్తుంటే.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. వీడియో ఇదిగో!
13-06-2020 Sat 18:07
- కోల్ కతాకు 120 కిలోమీటర్ల దూరంలో ఘటన
- కొన్ని రోజులుగా కాలువను శుభ్రం చేస్తున్న అధికారులు
- పునాదులు కూడా బలహీనంగా ఉన్నాయన్న అధికారులు

నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన పశ్చిమబెంగాల్ లోని మిడ్నపూర్ జిల్లా నిశ్చింతపూర్ గ్రామంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. కోల్ కతాకు 120 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనానికి ఆనుకుని ఉన్న కెనాల్ ను శుభ్రం చేయడంతో భవనం కూలిపోయింది. కొన్ని రోజులుగా కెనాల్ ను శుభ్రం చేసే పనిని అధికారులు చేపట్టారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితమే బిల్డింగ్ కి పగుళ్లు ఏర్పడటం ప్రారంభమైంది.
మరోవైపు, గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. బిల్డింగ్ పునాదులు కూడా బలహీనంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు, ప్రభుత్వ భూమిని ఆక్రమించి, కెనాల్ లోపలి వరకు భవన నిర్మాణాన్ని చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ADVERTSIEMENT
More Telugu News
కేన్స్ లో నా బ్రాండ్ ఇదే: పూజా హెగ్డే
1 minute ago

తెలంగాణలో తాజాగా 47 మందికి కరోనా పాజిటివ్
29 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
2 hours ago
