భారత్-చైనా మధ్య సైనిక చర్చలు జరిగాయి: విదేశాంగ శాఖ
07-06-2020 Sun 10:21
- సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి
- సమస్యల శాంతియుత పరిష్కారానికి ఇరు పక్షాలు అంగీకరించాయి
- సరిహద్దు వెంబడి శాంతి నెలకొల్పడం అవసరం

లఢఖ్‌లో చైనా సైన్యం దుందుడుకు చర్యలతో ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామని ప్రకటించిన ఇరు దేశాలు తాజాగా చర్చలు జరిపాయి. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ ఈ రోజు ప్రకటన చేసింది. చుషుల్-మోల్దో ప్రాంతంలో నిన్న ఇరు దేశాల అగ్రశేణి ఆర్మీ కమాండర్లు ఈ భేటీలో పాల్గొన్నారని వివరించింది.
భారత్-చైనా మధ్య సైనిక చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఏర్పడుతోన్న సమస్యల శాంతియుత పరిష్కారానికి ఇరు పక్షాలు అంగీకరించాయని పేర్కొంది. ధ్వైపాక్షిక బంధాల కోసం సరిహద్దు వెంబడి శాంతి నెలకొల్పడం అవసరమని తెలిపింది.
ADVERTSIEMENT
More Telugu News
చివరి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన ఆర్సీబీ
25 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
37 minutes ago

'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
1 hour ago

త్రివిక్రమ్ .. మహేశ్ బాబు మూవీలో నాని?
2 hours ago
