తిరుమల కనుమ దారిలో గజరాజుల సంచారం
05-06-2020 Fri 21:02
- ఇటీవల తిరుమలలో పెరిగిన జంతువుల సంచారం
- రోడ్డు దాటుతూ దర్శనమిచ్చిన ఏనుగులు
- సెల్ ఫోన్ లో రికార్డు చేసిన టీటీడీ ఉద్యోగులు

లాక్ డౌన్ కారణంగా తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో తిరుమల జంతువుల సంచారానికి ఆవాసంగా మారింది. రాత్రివేళల్లో చిరుతలు, ఎలుగుబంట్లు యథేచ్ఛగా సంచరించడం మీడియాలో కూడా వెల్లడైంది. తాజాగా తిరుమల మొదటి కనుమ రహదారిపై గజరాజులు దర్శనమిచ్చాయి. ఓ పెద్ద ఏనుగుల సమూహం రోడ్డు దాటుతూ కనిపించింది. రోడ్డుపై వాహనాలు తిరగకపోవడంతో వన్యప్రాణులు ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నాయి. ఏనుగులు రోడ్డు దాటుతున్న దృశ్యాలను టీటీడీకి చెందిన కొందరు ఉద్యోగులు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు.
More Latest News
రొంపిచర్లలో వృద్ధురాలిపై అత్యాచారం.. ఆపై హత్య
20 minutes ago

ఏటీఎంలో చోరీకి యత్నం.. ఫలించకపోవడంతో నిప్పు
2 hours ago

మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'
11 hours ago

తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్
12 hours ago
