నిసర్గ తుపాను.. కరెంట్ స్తంభం మీద పడడంతో ఒకరి దుర్మరణం
Advertisement
నిసర్గ తుపాను మహారాష్ట్రపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారీ వర్షం, గాలుల కారణంగా రాష్ట్రంలోని అలీబాగ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఎలెక్ట్రిక్ స్తంభం కూలి మీద పడటంతో 58 ఏళ్ల దశరథ్ బాబు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయనపై పోల్ కూలింది.

ఆ సమయంలో విద్యుత్ ప్రవాహం లేనప్పటికీ... స్తంభం బలంగా తాకడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కాసేపటికే ఆయన మృతి చెందారు. ఉదయం ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీబాగ్ లో తుపాను తీరాన్ని దాటింది. ఈ ప్రాంతం బీచ్ లకు పేరుమోసింది. ఎంతో మంది సెలబ్రిటీల బంగళాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ప్రస్తుతం వర్ష ప్రభావం తక్కువగానే ఉంది. ఈదురు గాలులు మాత్రం వీస్తున్నాయి.
Wed, Jun 03, 2020, 08:38 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View