డాక్టర్ సుధాకర్ పై కూడా కేసు నమోదు చేసిన సీబీఐ!
03-06-2020 Wed 12:54
- ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న డాక్టర్ సుధాకర్ వ్యవహారం
- హైకోర్టు తీర్పుతో రంగంలోకి దిగిన సీబీఐ
- పలు సెక్షన్ల కింద సుధాకర్ కేసు నమోదు

వైజాగ్ డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోకి దిగడంతో వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే పోలీసులపై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
తాజాగా డాక్టర్ సుధాకర్ పై కూడా కేసు నమోదు చేసింది. నడిరోడ్డు మీద ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై మాట తూలడం, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ తన వెబ్ సైట్లో ఉంచింది.
పోలీసులపై సీబీఐ నమోదు చేసిన కేసులో కావాలని తిట్టడం, కుట్ర కోణం, అక్రమ నిర్బంధం, చోరీ, బెదరింపులు వంటి సెక్షన్లు ఉన్నాయి.
More Latest News
కార్బొహైడ్రేట్లన్నీ చెడ్డవి కాదు.. ఇవి తీసుకుంటే బరువు తగ్గొచ్చు, మధుమేహం కూడా నియంత్రణలోకి..!
22 minutes ago

చరిత్ర సృష్టించిన తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ
32 minutes ago

అంగారకుడిపై ఈ డబ్బాలు గీసిందెవరు?
53 minutes ago

లావణ్య ‘హ్యాపీ బర్త్డే’ డేట్ మారింది
57 minutes ago

గ్రామ సచివాలయ సిబ్బందిపై దాడి చేసి వారిపైనే కేసు పెట్టిన సర్పంచ్ కుటుంబం... వీడియో ఇదిగో
2 hours ago
