తెలంగాణలో ఆపిల్... తొలిపంటను సీఎం కేసీఆర్ కు సమర్పించిన రైతు బాలాజీ
Advertisement
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధోనోరా గ్రామవాసి బాలాజీ ఓ రైతు. అయితే ఎవరూ చేపట్టని విధంగా ఆపిల్ పంట వేసి విజయం సాధించాడు. ఇవాళ తన తొలి పంటను సీఎం కేసీఆర్ కు సమర్పించి మురిసిపోయాడు. ప్రగతి భవన్ కు వెళ్లిన రైతు బాలాజీ ఓ చిన్న బుట్టలో కేసీఆర్ కు ఆపిల్ ఫలాలు అందించాడు.

ప్రకృతి రీత్యా అననుకూల వాతావరణంలో ఆపిల్ సాగు చేసి అధిక దిగుబడులు సాధించిన రైతు బాలాజీని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. సీసీఎంబీ, వ్యవసాయ శాఖ సలహాలతో ఆపిల్ ను వాణిజ్య పంటగా సాగు చేస్తున్న రైతు బాలాజీ తెలంగాణ రైతాంగానికి కొత్త ఆశలు కల్పిస్తున్నాడు.
Tue, Jun 02, 2020, 08:30 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View