విజయవాడలో గ్యాంగ్ వార్... ఓ గ్రూప్ లీడర్ మృతి
Advertisement
విజయవాడలో ఇవాళ జరిగిన గ్యాంగ్ వార్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో ఓ గ్యాంగ్ లీడర్ మృతి చెందడం మరిన్ని దాడులకు దారితీస్తుందని భావిస్తున్నారు. తొలుత ఈ దాడులను రెండు విద్యార్థి గ్రూపుల మధ్య దాడిగా భావించినా, ఆపై ఇది కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కోసం జరిగిన గ్యాంగ్ వార్ అని తెలిసింది.

యనమల కుదురులోని ఓ భూ వివాదంలో మణికంఠ, తోట సందీప్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా, రాజీ కుదుర్చుకుందాం అంటూ ఇరు వర్గాలు వచ్చాయి. అయితే, ఓ పథకం ప్రకారం రెండు గ్రూపులు ఆయుధాలతో వచ్చాయి. ఓ మైదానంలో దొమ్మీ జరుగుతోందా అనిపించే స్థాయిలో ఈ గ్యాంగ్ వార్ జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తోట సందీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Sun, May 31, 2020, 09:07 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View