కరాచీ విమాన ప్రమాదంలో తేలిన మృతుల లెక్క.. 97 మంది మృతి!
23-05-2020 Sat 09:02
- ల్యాండ్ కావడానికి నిమిషం ముందు కూలిన విమానం
- ప్రమాద సమయంలో విమానంలో 99 మంది
- ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇద్దరు

పాకిస్థాన్లోని కరాచీలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 97కు పెరిగింది. దుర్ఘటన జరిగిన సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, 97 మంది మరణించారు. ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
మరోవైపు, విమానం జనావాస ప్రాంతాల్లో కుప్పకూలడంతో స్థానికుల్లో చాలామంది గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సందర్భంగా పురుషులు ప్రార్థనల కోసం మసీదులకు వెళ్లడంతో ఇంటి పట్టున ఉన్న మహిళలు ఎక్కువ మంది గాయపడ్డారు. మృతుల్లో చాలామంది ప్రయాణికులు సీటు బెల్టు ధరించే ఉన్నారని అధికారులు తెలిపారు.
More Latest News
అంతర్జాతీయ స్థాయిలో 'కార్తికేయ 3'
33 minutes ago

ఢిల్లీలో మళ్లీ మాస్క్ ల విధానం.. ఉల్లంఘనులకు జరిమానాలు
36 minutes ago

బీసీసీఐ అనుమతిస్తే.. విదేశీ లీగ్ లో మెంటార్ గా ధోనీ!
39 minutes ago

నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తే చట్టపరమైన చర్యలు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
1 hour ago
