పాకిస్థాన్ ఘోర విమాన ప్రమాదంపై మోదీ, ఇమ్రాన్ ఖాన్ స్పందన

22-05-2020 Fri 20:12
Deeply Saddened By The Loss Of Life says PM Modi On Pakistan Plane Crash

పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ఒక్క నిమిషం ముందు పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం క్రాష్ అయింది. ప్రమాద సమయంలో 91 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది క్రూ సిబ్బంది విమానంలో ఉన్నారు. ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ... మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'పాకిస్థాన్ విమాన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధిస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని మోదీ ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ క్రాష్ తో షాక్ కు గురయ్యానని చెప్పారు. పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ సీఈవోతో టచ్ లో ఉన్నానని... సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిబ్బందితో కూడా మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించామని తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నానని చెప్పారు.

..Read this also
ఇది వినడానికే సిగ్గుగా ఉంది: విజయశాంతి
  • ప్రభుత్వ వైద్య రంగంపై విజయశాంతి వ్యాఖ్యలు
  • ఐఐపీఎస్ సర్వే ప్రస్తావన
  • ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శలు
  • తెలంగాణ చివరి నుంచి నాలుగోస్థానంలో ఉందని వెల్లడి


..Read this also
మోదీతో క‌ర‌చాల‌నానికి నేత‌ల‌ను దాటుకుంటూ వెళ్లి.. భుజం తట్టి కరచాలనం చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. వీడియో ఇదిగో
  • జీ7 దేశాల స‌ద‌స్సు కోసం మ్యూనిక్ వెళ్లిన మోదీ
  • ఆయా దేశాధినేత‌ల‌తో క‌లిసి గ్రూప్ ఫొటో దిగిన ప్ర‌ధాని
  • బైడెన్‌తో ఆత్మీయ క‌ర‌చాల‌నం చేసిన మోదీ

..Read this also
మ్యూనిక్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం ఇలా.. స్వయంగా వీడియో ట్వీట్​ చేసిన ప్రధాని
  • జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారమే జర్మనీ వెళ్లిన మోదీ
  • ఆ సమయంలో ఘనంగా స్వాగతం పలికిన భారత సంతతి ప్రజలు
  • ఆ వీడియోను సోమవారం ట్వీట్ చేసిన ప్రధాని


More Latest News
Ambati Rambabu says Pawan never become CM
Minister Jogi Ramesh slams TDP Chief Chandrababu
apiic new offer to industrialists in ap
telangana government regularises contract junior lecturers services
Aaditya Thackeray viral comments on revel mlas
Rahul Gandhi reacts to Mohammed Zubair arrest
Mahindra Scorpio N launched
Vijayasanthi slams Telangana govt
Telangana corona media bulletin
ap cm ys jagan paris tour will start tomorrow night
Sachin Pilot recalls Ashok Gehlot comments
muslins try to attack ysrcp mla rachamallu siva prasada reddy in proddatur
Ram Charan hosts Salman Khan and Pooja Hegde
ysrcp leader ramanamma resigns to piduguralla mpp post
..more