చంద్రబాబు ఇప్పుడు కూడా నీచ రాజకీయాలే చేస్తున్నారు: లక్ష్మీపార్వతి

22-05-2020 Fri 16:13
Chandrababu bain not grown says Lakshmi Parvathi

ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సేవలు అవసరం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని చెప్పారు. దుర్బుద్ధి వల్లే చంద్రబాబు అడ్రస్ లేకుండా పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు... ప్రతి అంశాన్ని రాజకీయాలకు అనుగుణంగా మలుచుకునేందుకు యత్నిస్తారని విమర్శించారు. డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ కూడా చంద్రబాబు రాజకీయాలకు బలవుతున్నారని చెప్పారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నీచ రాజకీయాలే చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.

జూమ్ ద్వారా మీటింగులు పెట్టుకుంటూ జూమ్ నాయకుడిగా ఎదిగిపోయారని అన్నారు. పాలనాకాలంలో చంద్రబాబు సాధించింది ఏమీ లేదని... ఏడాదిలోనే 90 శాతం హామీలను జగన్ పూర్తి చేశారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ఒక తండ్రిలా జగన్ సేవ చేస్తున్నాడని అన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు.

డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ ఇద్దరూ టీడీపీ సానుభూతిపరులని లక్ష్మీపార్వతి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం సుధాకర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని చెప్పారు. టీడీపీకి అనుకూలంగా రంగనాయకమ్మ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. 66 ఏళ్ల మహిళపై కేసులు పెట్టారంటూ టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని... గతంలో తనపై చేసిన తప్పుడు ప్రచారం వారికి గుర్తులేదా? అని మండిపడ్డారు.

..Read this also
ఏపీ సీఎం జ‌గ‌న్‌తో సంభాషించిన ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము
  • ఇప్ప‌టికే నామినేష‌న్ దాఖ‌లు చేసిన ముర్ము
  • ముర్ముకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన వైసీపీ
  • ఢిల్లీ నుంచి జ‌గ‌న్‌తో సంభాషించిన ముర్ము


..Read this also
మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి గెలుపు... ఉప ఎన్నిక‌లో వైసీపీ ఘ‌న విజ‌యం
  • 15వ రౌండ్‌కే 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన విక్ర‌మ్ రెడ్డి
  • మొత్తంగా 82,888 ఓట్ల మెజారిటీతో ఘ‌న విజ‌యం
  • డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ కుమార్‌

..Read this also
ఉప ఎన్నిక‌లో 12 రౌండ్లలో 50 వేలకు పైగా ఆధిక్యం సాధించిన మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి
  • కొన‌సాగుతున్న ఆత్మ‌కూరు బైపోల్ కౌంటింగ్‌
  • ఇప్ప‌టికే పూర్తి అయిన 12వ రౌండ్ లెక్కింపు
  • భారీ ఆధిక్యం దిశ‌గా వైసీపీ అభ్య‌ర్థి విక్ర‌మ్ రెడ్డి
  • మ‌ధ్యాహ్నంలోగానే వెలువ‌డ‌నున్న ఫ‌లితం


More Latest News
Investigate the cancellation of 19 lakh ration cards Bandi Sanjay complains to NHRC
aap defeated in sangrur bypolls in punjab
Modi speech in Man Ki Baat
nda presidentialcandidate draupadi murmu will meet ap cm ys jagan virtually
11739 New Covid Cases In India 25 Virus Related Deaths
aap wins rajinder nagar bypoll in delhi
Looking Forward To fruitful Discussions With G7 Leaders says PM Modi
Sun Look Like a goddess flying out of the sea
jupalli krishna rao says will file defamation suit against mla harshavardhan reddy
Samantha Ruth Prabhu tops the list of Indias most popular female stars
Aaditya Thackeray Open Challenge To Rebel Shivsena Mlas
ex minister prattipati pullarao comments on tdp alliances
good carbs and bad carbs what you need to know
AP archer Jyothi surekha wins historical gold and silver in world cup
mekapati vikram reddy wins atmakur bypoll with record majority
..more