విశాఖ హెచ్ పీసీఎల్ రిఫైనరీలో తెల్లని పొగలు... ఇళ్లలోంచి పరుగులు తీసిన స్థానికులు!
21-05-2020 Thu 16:46
- ఇటీవలే విశాఖలో గ్యాస్ లీక్
- మరోసారి హడలిపోయిన ప్రజలు
- హెచ్ పీసీఎల్ లో కలకలం రేపిన పొగలు

విశాఖపట్నంలో ఇటీవల ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ విషవాయువు లీకవడం ఎంతటి భయాందోళనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయం మరుగున పడకముందే మరో కలకలం రేగింది. విశాఖలోని హెచ్ పీసీఎల్ రిఫైనరీలో తెల్లని పొగలు కనిపించడం స్థానికులను హడలెత్తించింది. రిఫైనరీలోని ఎస్ హెచ్ యూ విభాగాన్ని తెరిచే ప్రయత్నంలో తెల్లని పొగలు రావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చారు.
అయితే కాసేపటికే పొగలు తగ్గిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై హెచ్ పీసీఎల్ యాజమాన్యం స్పందిస్తూ, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్టు గుర్తించామని, సమస్యను వెంటనే చక్కదిద్దామని తెలిపింది. ఇప్పుడు ఎలాంటి పొగ రావట్లేదని స్పష్టం చేసింది.
More Latest News
ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు!
59 seconds ago

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు
12 minutes ago

హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం.. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
22 minutes ago

అందుకే ఎన్టీఆర్ ప్రాజెక్టు ఆలస్యమవుతోందట!
37 minutes ago

నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
53 minutes ago

'పుష్ప 2'లో మరో హీరోయిన్ పాత్ర అదేనట!
1 hour ago
