ఇంటి భోజనానికే సై అంటున్న హైదరాబాద్ పోలీసులు
21-05-2020 Thu 10:13
- పోలీసుల ఆరోగ్యంపై ఉన్నతాధికారుల ఆందోళన
- ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకునేందుకు సర్వే
- తాము ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నామన్న 85 శాతం మంది

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల్లో 85 శాతం మంది ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. రాత్రింబవళ్లు రోడ్లపైనే పడిగాపులు కాస్తూ ఆరోగ్యాలను పణంగా పెడుతుండడంపై ఆందోళన చెందిన ఉన్నతాధికారులు.. వారి ఆరోగ్య పరిస్థితి, రోజువారీ అలవాట్లను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది పోలీసులు తాము ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నట్టు చెప్పారు.
బయట తింటే ఆరోగ్యాలు పాడవుతాయన్న ఉద్దేశంతో లాక్డౌన్ ముందు నుంచీ తాము ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నట్టు చెప్పారని అధికారులు తెలిపారు. శిక్షణ సమయంలోనే ఆహారపు అలవాట్ల గురించి కిందిస్థాయి సిబ్బందికి బోధిస్తున్నామని, ఇప్పుడు దాని ఫలితాలు కనిపిస్తున్నాయని వివరించారు.
ADVERTSIEMENT
More Telugu News
కేన్స్ లో పూజా హెగ్డేకి చేదు అనుభవం... ఏం జరిగిందంటే...!
12 minutes ago

ఎన్టీఆర్ కథపై బుచ్చిబాబు కసరత్తు పూర్తి కాలేదట!
40 minutes ago

కోలీవుడ్ యంగ్ హీరో జోడీగా సాయిపల్లవి!
1 hour ago
