అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప అంత్యక్రియల్లో కాల్పులు.. ఆరుగురి అరెస్ట్!
16-05-2020 Sat 15:37
- నిన్న మృతి చెందిన ముత్తప్ప రాయ్
- బిడదిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు
- ముత్తప్పకు గన్ శాల్యూట్ చేసిన అనుచరులు

బెంగళూరు చివరి అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప అంత్యక్రియల సందర్బంగా గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనలో ఆరుగురు అరెస్ట్ అయ్యారు. కర్ణాటక రామనగర జిల్లా బిడదిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... డాన్ ముత్తప్ప రాయ్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని అనుచరులు బిడదిలోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు ఆయన భౌతికకాయానికి గన్ శాల్యూట్ చేశారు. గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
ఈ నేపథ్యంలో బిడది పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ మాట్లాడుతూ, ఆయుధాల చట్టం కింద ఆరుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అందరినీ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాల్పులు జరిపేందుకు ఉపయోగించిన తుపాకులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
More Latest News
మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'
5 hours ago

తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్
6 hours ago

వరల్డ్ చాంపియన్ షిప్‌కు పీవీ సింధు దూరం... కారణం చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ షట్లర్
6 hours ago

విజయనగరం జిల్లాలో పాత ఇల్లు కూల్చుతుండగా బయటపడిన లాకర్... మాదంటే మాదని యజమాని, కూలీల మధ్య వివాదం
7 hours ago
