తీహార్ జైల్లో కరోనా కలకలం... ఖైదీకి పాజిటివ్, జైలర్లకు క్వారంటైన్
11-05-2020 Mon 13:19
- ఇటీవలే ఓ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి
- జ్యుడిషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం
- కరోనా లక్షణాలతో బాధపడుతున్న వైనం

ఢిల్లీ తీహార్ జైల్లో కరోనా కలకలం రేగింది. ఓ రిమాండ్ ఖైదీకి కరోనా పాజిటివ్ గా తేలడంతో జైలు వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఆ వ్యక్తి ఇటీవలే అత్యాచారం ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అతడికి న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో, జైల్లోని కొందరు జైలర్లను క్వారంటైన్ కు పంపారు. పెద్ద సంఖ్యలో ఖైదీలు ఉన్న తీహార్ జైలులో కరోనా కేసు వెలుగుచూడడంతో జైలు వర్గాల్లో ఆందోళన మొదలైంది.
More Latest News
ప్రకృతి విరుద్దమైన బంధం.. వద్దన్నారని లింగమార్పిడి
2 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
6 minutes ago

శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
17 minutes ago

తెలంగాణ డీజీపీ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. పోలీసులనే డబ్బు అడిగిన సైబర్ నేరగాళ్లు!
55 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
1 hour ago
