బాలికపై ఎంఐఎం నేత అత్యాచారం..  రిమాండ్ కు తరలింపు!

08-05-2020 Fri 14:17
MIM leader rapes minor girl in Hyderabad

బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో ఎంఐఎం నేత షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ చాదర్ ఘాట్ కమలానగర్ లో జరిగింది. ఈ సందర్బంగా బాధితురాలిని బీజేపీ నేతలు, దళిత సంఘాలు పరామర్శించాయి. అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, పాతబస్తీలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. షకీల్ కు ఎంఐఎం అండగా ఉందని ఆరోపించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు బాధితురాలిని ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధితురాలికి పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పారు. నిందితుడికి శిక్షపడేలా చూస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బలాలా బాధితురాలు ఇంటికి చేరుకున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

దీనిపై బలాలా మాట్లాడుతూ, నిందితుడికి తమ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. ఫొటోలు పెట్టుకున్న వారంతా అనుచరులు  కాదని అన్నారు. ప్రధాని మోదీ ఫొటోను విజయ్ మాల్యా పెట్టుకున్నారని... అంత మాత్రాన మోదీని విమర్శిస్తే ఎలాగని ప్రశ్నించారు.

..Read this also
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం... చిన్నారి సహా ఐదుగురు హైదరాబాద్ వాసుల దుర్మరణం
  • బీదర్ జిల్లాలో రహదారి రక్తదాహం
  • హైదరాబాద్ నుంచి గంగాపూర్ వెళుతున్న కుటుంబం
  • కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొన్న కారు
  • మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు
  • దత్తాత్రేయ ఆలయ సందర్శనకు వెళుతుండగా ఘటన


..Read this also
ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు!
  • నేడు స్వాతంత్ర్య దినోత్సవం
  • రాజ్ భవన్ లో ఎట్ హోమ్
  • తేనీటి విందు ఏర్పాటు చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
  • చివరి నిమిషంలో ఎట్ హోమ్ కు కేసీఆర్ దూరం

..Read this also
తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
  • గత 24 గంటల్లో 17,521 కరోనా పరీక్షలు
  • 265 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 142 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 528 మంది
  • ఇంకా 3,183 మందికి చికిత్స


More Latest News
Bose daughter Anita opines on his father mysterious death
Four students died in road accident in Guntur district
Chiranjeevi met fan who is in hospital
CM Jagan and Chandrababu maintains distance in Raj Bhavan
Hyderabadis dies in road mishap in Karnataka
AP Govt releases prisoners on good conduct
CM KCR keeps distance to At Home
Corona positive cases number declines in Telangana
Al Qiada calls Indian Muslims bring Nupur Sharma for justice
Chandrababu and other TDP leaders attends At Home in Raj Bhavan
Cricketer Shami wife requests Modi and Amit Shah to change india name to Bharat or Hindustan
Mahindra unveils new electric vehicles
Karthikeya 2 movie team interview
Will be in Munugodu from August 20 says Revanth Reddy
CM Jagan and opposition leader Chandrababu attends At Home
..more