'పోలీస్ స్టోరీ' వరకూ నాన్నకు ఫ్లాపులే పడ్డాయి: హీరో ఆది సాయికుమార్
02-05-2020 Sat 11:26
- ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను
- ఆ దర్శకులతో సినిమాలు చేయాలనుంది
- హిట్ కోసం వెయిట్ చేస్తున్నానన్న ఆది

తెలుగులో యువ కథానాయకులతో పోటీపడటానికి ఆదిసాయికుమార్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు వున్నాయి. సోషియో ఫాంటసీతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా 'జంగిల్' రూపొందుతుంటే, ప్రేమకథా చిత్రంగా 'శశి' నిర్మితమవుతోంది.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " నా కెరియర్ తొలినాళ్లలో కథల ఎంపిక విషయంలో నాన్నగారి సూచనలు ఉండేవి. ఆ తరువాత నా కథలకు సంబంధించిన నిర్ణయాలను నేనే తీసుకోవాలని అనుకున్నాను. అలా చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను అందించలేదు. 'పోలీస్ స్టోరీ'కి ముందువరకూ నాన్నగారికి చాలా పరాజయాలు ఎదురయ్యాయి. నాన్నగారికి 'పోలీస్ స్టోరీ' హిట్ పడినట్టు నాకు ఒక మంచి హిట్ పడేవరకూ ఎదురుచూడవలసిందే. పూరి .. శేఖర్ కమ్ముల .. మోహనకృష్ణ ఇంద్రగంటి .. సందీప్ రెడ్డి వంటి దర్శకులతో పనిచేయాలనుంది" అని చెప్పుకొచ్చాడు.
ADVERTSIEMENT
More Telugu News
సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న అడివి శేష్ 'మేజర్'
23 minutes ago

హరీశ్ శంకర్ తో రామ్ సినిమా!
32 minutes ago

సముద్ర గర్భంలో పంచదార కొండలు... తాజా అధ్యయనంలో వెల్లడి
40 minutes ago

ముస్లింలు ఈ దేశాన్ని సుసంపన్నం చేశారు: ఒవైసీ
51 minutes ago
